హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ఎక్సైజ్‌శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరూ సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పనిచేయాలని తీర్మానించారు. ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజీ పీఈఈఓఏ) సర్వసభ్య సమావేశం జరిగింది.
ఎక్సైజ్‌శాఖలో అసోసియేషన్ నుంచి ప్రభుత్వానికి ఇవ్వవలసిన వినతులు, హకులు, విధుల నిర్వహణ గురించి పలు తీర్మానాలు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ల స్థాయి అధికారులు హాజరయ్యారు. అసోసియేషన్‌కు కొత్త స్టీరింగ్ కమిటీని నియమించి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.