Telangana Colleges | హైదరాబాద్ : పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని అటు విద్యార్థులు, ఇటు ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలతో పాటు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. తమకేమీ పట్టనట్టు విద్యార్థుల జీవితాలతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతోంది.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో.. ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అన్ని కాలేజీలను నిరవధికంగా బంద్ చేయనున్నట్టు ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 10 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ను కలిసి నోటీసు అందజేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయనందుకు నిరసనగా ఇంజినీర్స్ డేను బ్లాక్‌డేగా పాటిస్తామని ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి.