హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): సబ్బండ వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు పెద్దపీట వేసిందని, రూ.3.4 లక్షల కోట్ల బడ్జెట్లో 1,44,156 కోట్లు కేటాయించడమే అందుకు నిదర్శనమని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చలో సమాధానం ఇస్తూ మాట్లాడారు.
ఎస్సీ సబ్‌ప్లాన్‌కు ఏకంగా రూ.40 వేల కోట్లు కేటాయించామని, ప్రతిపైసా ఖర్చు చేస్తామని తెలిపారు. శక్తి మేరకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నట్టు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఇతర కార్పొరేషన్ల పటిష్ఠానికి చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.