హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(టీజీజెన్కో) ‘బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ సేఫ్టీ’ అవార్డు సొంతం చేసుకుంది. దీంతోపాటు 2023-24కు గానూ ప్రతిష్టాత్మక ‘5-స్టార్’ రేటింగ్ అవార్డు గెలుచుకుంది.
ముంబైలో గురువారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్చంద్ర దూబే టీజీజెన్కో అధికారులకు అవార్డు అందజేశారు.