Telangana Police Logo | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పోలీస్ లోగో మారింది. పదేండ్లపాటు ‘తెలంగాణ స్టేట్ పోలీస్’ అని ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘స్టేట్’ అనే పదాన్ని తొలగించి ‘తెలంగాణ పోలీస్’గా మార్చారు. గత నెలలో హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి చేసిన ఉత్తర్వుల మేరకు.. లోగోతోపాటు బ్యాడ్జీలు, క్యాపులు, బెల్టులను మార్చారు. అందుకు సంబంధించిన బడ్జెట్ను హోంశాఖకు పంప గా.. అందరికీ కొత్త లోగోలు పంపిణీ చేసినట్టు తెలిసింది. లోగో మార్పుపై తెలంగాణ పోలీస్ ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేశారు.