దేశంలో తెలంగాణ పోలీసే నంబర్ వన్ : హోంమంత్రి మహమూద్ అలీ
Model police convention center siddipet |

సిద్ధిపేట : తెలంగాణ నంబర్ వన్ పోలీస్ అంటే తెలంగాణేనని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం ఆయన రూ.10కోట్లతో సిద్ధిపేట పట్టణంలో నిర్మించిన మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌ను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌తో కలిసి ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ, సహకారంతోనే మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ వేగంగా నిర్మాణం అయ్యిందన్నారు. ప్రతి జిల్లాలో సిద్ధిపేటలాంటి మోడల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కావాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్ అంటే భయం ఉండేదని, తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్తో పోలీసులకు గౌరవం పెరిగిందన్నారు. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సిద్ధిపేట హైటెక్ సిటీ తరహాలో అభివృద్ధి జరిగిందన్నారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో పోలీస్‌శాఖలో అనేక సంస్కరణలు అమలు చేసి దేశానికే ఆదర్శంగా పోలీస్‌శాఖను తీర్చిదిద్దామన్నారు. లా అండ్ ఆర్డర్లో ఆర్డర్ బాగుండడం వల్లే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, హరీశ్‌రావు సహకారంతో పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణ పోలీస్‌లు తమ పనితీరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని, తెలంగాణ పోలీస్‌కు అనేక రాష్ట్రాల ప్రశంసలు లభిస్తున్నాయన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

