హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): కొత్తగా వచ్చిన చట్టాల్లోని సెక్షన్లపై పోలీసు అధికారులు పట్టుసాధించాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు. కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చి 3 నెలలైన సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారాలపై పోలీసు అకాడమీలో శనివారం ఒకరోజు వర్క్‌షాపు, సమీక్ష నిర్వహించారు.
సవాళ్లను అధిగమించేందుకు వర్క్‌షాపు ఎంతో ఉపయోగపడిందని పోలీసు అకాడమీ డైరెక్టర్, డీజీ అభిలాష బిస్త్ అన్నారు. సమస్య లు, వాటి పరిష్కారాలను సీఐడీ డీజీ శిఖాగోయెల్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పోలీసు లు కచ్చితత్వం పాటించాలని రాజస్థా న్ మాజీ డీజీపీ డీసీ జైన్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, ఏడీజీలు సంజయ్ కుమార్ జైన్, స్టీఫెన్ రవీంద్ర, సీపీ అవినాశ్ మహంతి, ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి, నల్సార్ యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.