1. చంద్రశేఖరరావు విశాలదృష్టి
నిత్యనూత్నమై వెలుగొందు సత్యదీక్ష
సకలజనుల సౌహార్దత జవముకాగ
ముప్పదిమూడు జిల్లాలుగా మురిసె సీమ.
2. గొడవజేసిన కాళోజీ గొప్పహృదిని
జయపతాకమౌ మన జయశంకరున్ని
దాశరథి వీణ పలుకుకైతలను గనుచు
కీర్తిదాయక నేతల స్ఫూర్తిబడసె.
3. పైరుపచ్చల నేలమ్మ పరవశింప
నింగికెగయు కేరింతలు సింగిడవగ
తళుకులీను గులాబీలు తలనునిముర
కృష్ణ గోదావరి జలాలు తృష్ణ దీర్చె.
4. వీరయోధుల కన్నట్టి ధీరచరిత
కొలువుదీరిన కోటొక్క గుళ్ళ మహిమ
వంచనెఱుగని భేషగు మంచితోడ
అచ్చతెలుగు భాష విశేష ఆప్తినొందె.
5. నాలు కోట్లకు పైబడ్డ తెలుగుజాతి
సోయిదప్పక తల్లికి జోతలిడుచు
సత్యవర్తన పాలనన్ సంస్తుతింప
మన తెలంగాణ శిరమెత్తి మహిని నిలిచె.
– రా కు మా ర
95501 84758