పటాన్చెరు రూరల్, జూలై 14: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో గత నెల 30న జరిగిన పేలుడు ఘటనలో చికిత్స పొందుతున్న మరో కార్మికుడు సోమవారం మృతిచెందాడు.
వెస్ట్ బెంగాల్‌కు చెందిన తరపాడుతుడు (45) అనే కార్మికుడు మదినగూడలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మరణించాడు. కాగా ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతి చెందిన కార్మికుల సంఖ్య 45కు చేరింది. అయితే ఇప్పటికీ 8 మంది ఆచూకీ లభించలేదు.