TG PGECET 2025 | తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల మార్చి 12న పీజీ ఈసెట్ నోటిఫికేషన్ జారీ కానున్నది. ఈ విషయాన్ని తెలంగాణ ఉన్నత విద్యా మండలి సోమవారం తెలిపింది. మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఉన్నత విద్యా మండలి తెలిపింది. జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు జరుగుతాయని చెప్పింది.
నోటిఫికేషన్ ద్వారా ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయో-మెడికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బయో-టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, మెటలర్జికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ, జియో-ఇంజినీరింగ్ అండ్ జియో-ఇన్ఫర్మాటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫార్మసీ, టెక్స్టైల్ టెక్నాలజీ ఇలా 19 విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) ర్యాంకు ఆధారంగా ఆయా కోర్సుల్లో ఫుల్ టైమ్, ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్డీలో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీఈసెట్-2025 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత కోర్సును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఫార్మసీ ఉత్తీర్ణులు అయి ఉండాలి.