హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పీజీఈసెట్‌కు 11,347 దరఖాస్తులొచ్చాయి. 19 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనుండగా, అత్యధికంగా ఫార్మసీకి 4,579 మంది దరఖాస్తు చేసుకున్నారు.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 3,742, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌కు 1,036 చొప్పున విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కే వెంకటేశ్వర్రావు తెలిపారు. మే 6తో దరఖాస్తుల గడువు ముగియనుండగా, ఆలస్య రుసుముతో మే 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.