హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తేతెలంగాణ): తెలంగాణ టీజీ ఎడ్సెట్-25, టీజీ పీఈసెట్-25 నోటిఫికేషన్లను గురువారం విడుదల చేశారు. ఉన్నత వి ద్యామండలి అధికారులు వివరాలు వె ల్లడించారు. మార్చి10న ఎడ్సెట్ నోటిఫికేషన్, 12 నుంచి మే 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
జూన్ 1న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే మార్చి 13న పీఈసెట్ నోటిఫికేషన్, 15 నుంచి మే 24వరకు దరఖాస్తులు, మే 30 వరకు అదనపు రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 11 నుంచి 14 వర కు పరీక్షలు నిర్వహించనున్నారు. వివరాల కోసం ఎడ్యుకేషన్, పీఈసెట్ వెబ్సైట్లలో సంప్రదించాలని సూచించారు.