హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): దావోస్లో ఏర్పాటుచేసిన ‘తెలంగాణ పెవిలియన్’ను ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. దీనికి ‘తెలంగాణ – ఏ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్’ అని పేరు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వినూత్న పథకాలు, పెట్టుబడులకు ఇస్తున్న ప్రోత్సాహం, తెలంగాణ సాధించిన విజయాలను ఈ పెవిలియన్లో ప్రదర్శించారు.
హైదరాబాద్ నగరం విశిష్ఠతను వివరిస్తూ, ఇటీవల వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డును గెలుచుకున్నదని గుర్తు చేశారు. సమావేశానికి వచ్చే వారికి తెలంగాణ ఖ్యాతిని వివరిస్తూ, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పెవిలియన్ ఉపయోగపడనున్నది.