హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజనవర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అని చెప్పారు. ఆయన ఎంతో దార్శనికతతో రాజ్యాంగంలో పొందుపర్చిన ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించిందన్నారు. న్యాయమైన, సమానమైన సమాజం కోసం ఆయన చూపిన దారి మనందరిని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపిస్తున్నదని ఎక్స్ వేదికగా తెలిపారు.
Paying homage to the architect of the Indian Constitution, Dr B.R.Ambedkar on his 134th birth anniversary. May his vision of a just and equal society continue to inspire and guide us towards a brighter future!
Telangana owes its existence to the vision of Dr. B.R. Ambedkar, who… pic.twitter.com/folSShEpPn
— KTR (@KTRBRS) April 14, 2025