హైదరాబాద్, నవంబర్ 16(నమస్తే తెలంగాణ): జపాన్‌లో ఆటోమోటివ్ టెక్నీషియన్లు, సెమీకండక్టర్ ఇంజినీర్లు, ఆటోమొబైల్ సర్వీస్ అండ్ కస్టమర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) దరఖాస్తులు ఆహ్వానించింది. అభ్యర్థులు 30 ఏండ్ల వయసుతోపాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమోటివ్ ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్ మెషినరీలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ లేదా ఇంజినీరింగ్ పట్టా వుండాలని తెలిపారు. ఆసక్తిగలవారు tomcom. resume @ gmail. comకు మెయిల్ చేయాలని సూచించారు.