చిట్యాల, ఆగస్టు 23 : దేశానికి అత్యంత ప్రమాదకరంగా మారిన మతతత్వ బీజేపీని ఓడించడమే సీపీఎం ప్రధాన ధ్యేయమని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మె ల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా చిట్యాలలో మీడియాతో మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్ర, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఘట్టాలను బీజేపీ వక్రీకరించి, మతపరంగా చిత్రీకరించి తారుమారు చేసే దుర్మార్గపు చర్యలు చేపడుతున్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో జుట్టుకు మినహా అన్నింటికీ పన్నులు వేస్తూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని గుర్తుకు తెస్తున్నదని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర హోంమంత్రి అమిత్షా చెప్పులు మోయడం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడమేనన్నారు.