హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర మ త్స్య, సహకార సంఘాల సమాఖ్య చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమకారుడు, మత్స్యరంగ నిపుణుడు, జర్నలిస్ట్ పిట్టల రవీందర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. వైస్ చైర్మన్‌గా గంగపుత్ర సంఘాల సీనియర్ నాయకుడు దీటి మల్లయ్య నియమితులయ్యారు. సీఎం నిర్ణయం మేరకు పశు సంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్‌సిన్హా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన పిట్టల రవీందర్ సుదీర్ఘకాలం జర్నలిస్టుగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కో-కన్వీనర్‌గా వ్యవహరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రామాంతపూర్‌కు చెందిన దీటి మల్లయ్య ఉద్యమకారుడిగా, మత్స్యరంగ నిపుణుడిగా విశేష సేవలు అందించారు.