హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారుడికి అరుదైన గౌరవం దక్కింది. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డిని రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రిస్ కార్పొరేషన్ చైర్మన్గా బుధవారం సీఎం కేసీఆర్ నియమించారు.
1969 ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయన టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీల నాయకుడిగా, ప్రిసీడియం సభ్యుడిగా, ఆరేండ్లు ఉమ్మడి నల్లగొండ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989 నుంచి 1994 వరకు మిర్యాలగూడ ఎమ్మెల్యేగా కొనసాగారు. మిర్యాలగూడకు మూడుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన తిప్పన కృష్ణారెడ్డి తనయుడిగా, ఆయన నడచినదారిలో తెలంగాణ అడుగులో అడుగై కదిలారు.