హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : మాడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్(టీఎంఎస్టీఏ) కోరింది.
3వేల మంది రెగ్యులర్ టీచర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని అసోసియేషన్ అధ్యక్షుడు భూతం యాకమల్లు, సహ అధ్యక్షుడు వరప్రసాద్, ఉపాధ్యక్షుడు రాంరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జనవరి నుంచి వేతనాలు రాలేదని, మరణించిన 40 మంది కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు.