బండి సంజయ్, కిషన్‌రెడ్డికి మంత్రి వేముల ప్రశ్న
నిజామాబాద్, ఏప్రిల్ 3 : వరి వేయాలంటూ యాసంగి సీజన్ ప్రారంభంలో రైతులను రెచ్చగొట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీరుపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. వడ్ల కొనుగోలు విషయం వచ్చేసరికి ఇద్దరు బీజేపీ నేతలు ముఖం చాటేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌తో సంబంధం లేకుండా వరి ధా న్యాన్ని కేంద్రంతో కొనిపిస్తానని ప్రగల్భాలు పలికిన వారెక్కడున్నారంటూ ప్రశ్నించారు. నిజామాబాద్‌లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్యాంపు కార్యాలయంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఎమ్మెల్సీ వీజీగౌడ్, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎండీ రాజేశ్వర్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ..
వివిధ సందర్భాల్లో బండి, కిషన్‌రెడ్డి మాట్లాడిన వీడియోలను మంత్రి వేముల ప్రదర్శించారు. ఇప్పుడేమంటావ్ బండీ అంటూ నిలదీశారు. వరి పండించిన రైతులను రెచ్చగొట్టిన బీజేపీ లీడర్ల తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎంపీ అర్వింద్ చాప్టర్ క్లోజ్ అయ్యిందని అన్నారు. పసుపు బోర్డుపై బాండ్ పేపర్ రాసిచ్చిన అర్వింద్‌ను రైతులు అడుగడుగునా నిలదీస్తున్నారని చెప్పారు. చదువు ఫేక్, బాండ్ పేపర్‌తో ఫ్రాడ్, మాట్లాడేది ఫాల్స్ రూపంలో ఎఫ్ త్రీగా మారిన అర్వింద్.. బట్టేబాజ్, బక్వాస్, బడేఝూటా బీత్రీ నుం చి లంగా, లఫంగా, లత్కోర్గా ఎల్త్రీగా రూపాంతరం చెందాడంటూ టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి విమర్శించారు. ఎంపీ అర్వింద్ పుట్టుకే అవినీతితో ముడిపడి ఉన్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి డీ శ్రీనివాస్ ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు (బీఫామ్)అమ్ముకున్న చరిత్ర అర్వింద్‌కు ఉన్నదని మండిపడ్డారు.