కరీంనగర్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు అనుమతి లేని క్లినిక్లపై శనివారం తెలంగా ణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు దాడులు చేశా రు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మం డలం నీలోజిపల్లిలో కరుణ క్లినిక్ పేరు తో జక్కని లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అనుమతి లేకుండా, నిబంధనలు అతిక్రమించి అల్లోపతి వైద్యం చేస్తున్నట్టు గుర్తించారు. అల్లోపతి ఇంజక్షన్లు, యాంటీబయాటిక్, స్టెరాయిడ్ వంటి వాటిని రోగులకు ఉపయోగిస్తున్నట్టు తేలింది. కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్లో అనుమతులు లేకుండా రీసా, వం దర, సిటీ, శ్రీవిషిక పేరుతో నిర్వహిస్తున్న క్లినిక్లను గుర్తించారు. చింతకుంటలో ఆనం ద్ క్లినిక్కూ అనుమతులు లేనట్టు తెలిపారు.