బతికొస్తవనుకోలేదు కొడుకా!
ఉపాధి వేటలో దుబా య్ బాట పట్టిన యువకుడు ఓ హత్య కేసులో చిక్కుకొని 17 ఏండ్లు జైలు శిక్ష అనుభవించాడు. మంత్రి కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు ఇంటికి చేరాడు. కొడుకును చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.
- 17 ఏండ్ల తర్వాత దుబాయ్ జైలు నుంచి విముక్తి
- 15 లక్షలు చెల్లించి విడిపించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
- స్వగ్రామానికి చేరిన లక్ష్మణ్
- కుటుంబ సభ్యుల భావోద్వేగం
కోనరావుపేట, అక్టోబర్ 6: ఉపాధి వేటలో దుబా య్ బాట పట్టిన యువకుడు ఓ హత్య కేసులో చిక్కుకొని 17 ఏండ్లు జైలు శిక్ష అనుభవించాడు. మంత్రి కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు ఇంటికి చేరాడు. కొడుకును చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ‘బతికొస్తవనుకోలేదు కొడుకా.. నీ పాణం ఎట్లున్నది బిడ్డా’ అంటూ తల్లి కన్నీళ్లపర్యంతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన దండుగుల నర్సయ్య, లస్మవ్వ దంపతులకు కొడుకు లక్ష్మణ్ ఉపాధి కోసం 2004లో దుబాయ్ వెళ్లాడు.
అక్కడ నేపాల్‌కు చెందిన ఓ సెక్యూరిటీ గార్డు హత్య కేసులో ఇరుక్కుపోయి జైలుకు వెళ్లాడు. ఇతడితోపాటు సిరిసిల్ల మండలం పెద్దూరుకు చెందిన శివరాత్రి రవి, శివర్రాతి మల్లేశ్, శివరాత్రి హనుమంతు, గొల్లె నాంపెల్లి మరో నలుగురు శిక్ష అనుభవిస్తున్నారు. గతంలో మంత్రి కేటీఆర్ దుబాయ్ పర్యటనకు వెళ్లినప్పుడు బాధితుల క్షమాభిక్ష కోసం షరియా చట్టం ప్రకారం రూ.15 లక్షలు చెల్లించారు. నేర తీవ్రత దృష్ట్యా అక్కడి అధికారులు వీరిని విడుదల చేయలేదు.
ఇటీవల మంత్రి కేటీఆర్ స్వయంగా దుబాయ్ వెళ్లి అక్కడి అధికారులు, ప్రభుత్వంతో మాట్లాడారు. ఇందులో కోనరావుపేటకు చెందిన లక్ష్మణ్ అనారోగ్యంతోపాటు తదితర కారణాల రీత్యా న్యాయవాది అభ్యర్థన మేరకు విడుదలకు ఆమోదం తెలిపారు. దీంతో శుక్రవారం ఇండియన్ ఎంబసీ అధికారులు స్వయంగా హైదరాబాద్‌లో లక్ష్మణ్‌ను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మానసిక సమస్యతో బాధపడుతున్న లక్ష్మణ్ సురక్షితంగా ఇంటికి చేరా డు. తల్లి లస్మవ్వను చూసి కంటతడిపెట్టాడు. మంత్రి కేటీఆర్ దేవుడిలా వచ్చి లక్ష్మణ్‌ను ఇంటికి చేర్చాడని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

