హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): 29న ప్రపంచవ్యాప్తంగా ‘దీక్షా దివస్’ను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అమరుల త్యాగాలు, ఉద్యమ జ్ఞాపకాలు, కేసీఆర్ పోరాటస్ఫూర్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
తెలంగాణ సాధన కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన విషయాన్ని స్మరించుకున్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఎన్నారై విభాగం దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.