హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో ఈ నెల 28న ‘కథా కార్యశాల’ నిర్వహించనున్నట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి వెల్లడించారు. సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గలవారు 91824 45692 నంబర్‌ను సంప్రదించి, వాట్సాప్ ద్వారా ఫోన్ నంబర్, పేరు, వయస్సు, విద్య, వృత్తి, చిరునామా తదితర వివరాలు ఏప్రిల్ 23లోగా పంపి ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్(డీఎస్‌హెచ్‌ఎస్) పరిధిలో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్లకు మార్చి నెల వేతనం చెల్లించాలని తెలంగాణ నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కే ఆదిలక్ష్మి, కార్యదర్శి ఎస్ లలిత డిమాండ్ చేశారు. సోమవారం డీఎస్‌హెచ్‌ఎస్ కమిషనర్ అజయ్‌కుమార్‌కు ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.