KRMB | ఆంధ్రప్రదేశ్‌పై కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టిందంటూ కేఆర్ఎంబీకి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ధిక్కరించి.. ఏపీ పనులను కొనసాగిస్తోందన్నారు. కృష్ణా బేసిన్ వెలుపలకు నీటిని తరలించే పనులు ఏపీ చేపడుతుందోని, 59 టీఎంసీల నీటిని తరలించేలా పనులు కొనసాగిస్తోందని ఈఎన్సీ లేఖలో ప్రస్తావించారు. అంతరాష్ట్ర ఒప్పందాలకు విరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తోందని, పనులు కొనసాగితే తెలంగా ప్రాజెక్టులకు భారీగా నష్టం జరుగుతుందని ఈఎన్సీ తెలిపారు. తక్షణమే స్పందించి ఏపీ చేపడతున్న పనులను నిలిపివేయించాలని కోరారు.