హైదరాబాద్ : ఈ నెల 14వ తేదీన శాసనమండలి చైర్మన్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు సభ్యులకు మండలి అధికారులు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు మండలి చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించనున్నారు. ప్రస్తుతం మండలి ప్రొటెం చైర్మన్గా సయ్యద్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.