హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): వానకాలానికి సంబంధించి తెలంగాణ మార్ఫెడ్ సేకరించిన మకజొన్న విక్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వినూత్న ఈ-వేలం వి ధానం ద్వారా మునుపటికంటే రూ.20 2.56 కోట్ల అదనపు ఆదాయం లభించినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం ప్రకటనలో వెల్లడించారు. మొత్తం నిల్వలను 25 లాట్లుగా విభజించి నిబంధనలు సరళీకరించామని, తాజా ఈ-వేలంలో 78,9 16 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 3,80,187 మెట్రిక్ టన్నుల మ క్కలకు మెట్రిక్ టన్నుకు సగటున రూ.19,337 ధర లభించిందన్నారు.
‘తెలంగాణ వాతావరణ సలహా’ కా ర్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం సచివాలయంలో ప్రా రంభించారు. మండలాలవారీగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ సూచనలను రైతుల వాట్సాప్ నంబర్లకు చేరవేస్తామన్నారు.