Telangana | రాష్ట్రం సిద్ధించాక తెలంగాణ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను తెలంగాణీకరించింది. దాదాపు అన్ని తరగతుల్లో తెలంగాణ భాష, యాస, మండలికం, చరిత్రకు చోటు కల్పించింది. మన స్వీయ అస్తిత్వానికి విద్యార్థుల పాఠ్య పుస్తకాలు ప్రతీకగా నిలుస్తున్నాయి. మరుగున పడ్డ కళాకారులు కాపు రాజయ్య, కొండపల్లి శేషగిరిరావుసహా ఎంతో తెలంగాణ మంది కవులు, పండుగలు, 100 సాహిత్యకారులకు విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కింది. బతుకమ్మ, బోనాలు, సమ్మక్కసారక్క జాతరలు ఇప్పుడు పుస్తకాల్లో అక్షరీకరించబడ్డాయి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి జాతీయ అంతర్జాతీయ స్కూళ్లల్లోనూ తెలుగును తప్పనిసరి చేసింది.
➢ పాకాల యశోదారెడ్డి తెలంగాణ మాండలికంలో రాసిన కొత్తబాట అనే కథను 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో చేర్చారు. ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ జీవిత చరిత్రను పరిచయం చేశారు. తెలంగాణ వీరుల ప్రాశస్త్యాన్ని తెలిపే డాక్టర్ దాశరథి రచించిన వీర తెలంగాణ పాఠ్యాంశాన్ని చేర్చారు.
➢ 9వ తరగతి తెలుగు పుస్తకంలో సంగెం లక్ష్మీబాయి ఆత్మకథను ఉద్యమ స్ఫూర్తి పేరుతో పాఠ్యాంశంగా మలిచారు. నేనెరిగిన బూర్గుల పేరుతో పీవీ నరసింహారావు వ్యాసాన్ని పరిచయం చేశారు. ఉపవాచకం లో సురవరం ప్రతాపరెడ్డి, ప్రొ. జయశంకర్, కాళోజీ, కుమ్రం భీం జీవిత చరిత్రలకు చోటిచ్చారు.
➢ 8వ తరగతిలో చిందు, ఎల్లమ్మ, జానపద కళలను పరిచయం చేశారు. షోయబుల్లాఖాన్, వట్టికోట ఆళ్వారుస్వామి, చాకలి ఐలమ్మ పాఠాలను చేర్చారు.
➢ 7వ తరగతిలో చెరబండ రాజు గేయం ఏ కులం, రాణి శంకరమ్మ వీరగాథ, రుద్రమదేవి, ఆరుట్ల జీవిత విశేషాలను పొందుపరిచారు.
➢ 5వ తరగతిలో సాలార్జంగ్ మ్యూజియం, యాదగిరిగుట్ట, చిట్యాల ఐలమ్మ పాఠాన్ని చేర్చారు.
➢ 4వ తరగతిలో వినాయకచవితి, రంజాన్, నేను గోదావరిని, తెలంగాణ పిల్లలారా చేర్చగా, 4వ తరగతి తెలుగులో ‘కాళేశ్వరం’ పేరుతో పాఠ్యాంశాన్ని పొందుపరిచారు.
… మల్లేశం