జగిత్యాల, డిసెంబర్ 2 : ప్రభుత్వ దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయి, అమ్మఒడి వాహనం కోసం రెండు గంటలపాటు బాలింత ఎదురుచూసిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఊట్కూరుకు చెందిన గర్భిణి లక్కాకుల సరోజ ప్రసవం కోసం గతవారం జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌కు వచ్చింది. ప్రసవం తర్వాత సోమవారం దవాఖాన నుంచి డిశ్చార్జ్ చేశారు.
దవాఖాన ఆవరణలో అమ్మ ఒడి వాహనం కోసం బాలింత రెండు గంటలకు పైగా ఎదురుచూసింది. అయినా వాహనం రాకపోవడంతో విసిగివేసారిన కుటుం బ సభ్యులు ప్రైవేటు వాహనంలో ఇం టికి తరలించారు. ఈ విషయం మీడియాలో రాగా, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డీఎంహెచ్‌వోను కలెక్టర్ ఆదేశించారు.