న్యూఢిల్లీ, జూలై 14(నమస్తే తెలంగాణ): స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌లో తెలంగాణ మరోసారి సత్తాచాటింది. కేంద్రం తాజాగా ప్రకటించిన జిల్లాల జాబితాలో నాలుగు జిల్లాలు టాప్‌లో నిలిచాయి. వివిధ క్యాటగిరీల్లో మొత్తం 12 జిల్లాలను ప్రకటించింది. హై అచీవర్స్ విభాగంలో జనగామ, కామారెడ్డి, అచీవర్స్‌లో హన్మకొండ, ఖమ్మం అగ్రభాగాన నిలిచాయి. హై అచీవర్స్‌లో ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, ములుగు, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, కొత్తగూడెం తర్వాతి వరుసలో ఉన్నాయి. అచీవర్స్‌లో ఆసిఫాబాద్, మెదక్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, భూపాలపల్లి, నారాయణపేట, గద్వాల, వనపర్తి, రంగారెడ్డి జాబితాలో ఉండటం విశేషం. దేశవ్యాప్తంగా 400 పైచిలుకు పల్లెలు అవార్డుల జాబితాలో చేరగా తెలంగాణ ప్రత్యేక గుర్తింపును దక్కించుకొన్నది.