హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించి ఆ తరువాత తెలంగాణకు బదిలీ అయిన ఉద్యోగులకు ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది. ఐదునెలల తర్వాత పలు శాఖల్లో పోస్టింగ్స్నిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో18ని జారీచేసింది. దశాబ్దకాలంగా ఏపీలో పనిచేస్తున్న 44 మంది తెలంగాణ స్థానికత గల ఉద్యోగులను తెలంగాణకు కేటాయించి, ఏపీ సర్కార్ రిలీవ్ చేసింది. అయితే వీరంతా రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టు చేయగా, వీరికి పోస్టింగ్స్నివ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. టీఎన్జీవో సంఘం వినతి మేరకు వీరికి పలుశాఖల్లో పోస్టింగ్స్నిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.