e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 25, 2021
Home తెలంగాణ నలుగురు సీఈల బదిలీ

నలుగురు సీఈల బదిలీ

హైదరాబాద్‌, మార్చి 30 (నమస్తే తెలంగాణ): నీటిపారుదలశాఖలో నలుగురు చీఫ్‌ ఇంజినీర్లను (సీఈ) ప్రభుత్వం బదిలీ చేసింది. నాగర్‌కర్నూల్‌ సీఈ రమేశ్‌ను మహబూబ్‌నగర్‌కు, మహబూబ్‌నగర్‌ సీఈ శ్రీనివాస్‌ను హైదరాబాద్‌ సీడీవోకు, హైదరాబాద్‌ సీఈ హమీద్‌ఖాన్‌ను నాగర్‌కర్నూల్‌కు బదిలీచేశారు. హైదరాబాద్‌ సీడీ వో సీఈ మోహన్‌కుమార్‌ను వెయిటింగ్‌లో ఉంచారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు.
జలవనరుల అభివృద్ధి సంస్థ బోర్డులో మార్పులు
జలవనరుల అభివృద్ధిసంస్థ బోర్డులో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. గతంలో నీటిపారుదలశాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించారు. ఇకపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్నవారు చైర్మన్‌గా ఉంటారు. ఈఎన్సీ (కరీంనగర్‌)కు ప్రత్యేకంగా మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాధ్యతలు అప్పగించారు. గతంలో చైర్మన్‌సహా బోర్డులో 11 మంది సభ్యులు ఉండగా.. ఈ సంఖ్యను ఎనిమిదికి కుదించారు.

ఇవీ కూడా చదవండి

- Advertisement -

సూయ‌జ్ బ్లాకేడ్‌: 54 బిలియ‌న్ల డాల‌ర్ల న‌ష్టం!

ఠాణాకు నారసింహుడు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement