హైదరాబాద్, మే31 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ విరమణ పొందిన ఎస్ఈల స్థానంలో నలుగురు ఈఈలు, ఒక ఎస్ఈకి పూర్తిస్థాయి అదనపు బా ధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నర్సంపేట ఎస్ఈగా ములుగు ఇరిగేషన్ సర్కిల్ డివిజన్-2 ఈఈ వీ జగదీశ్‌కు, పోచంపాడ్ ఎస్ఈగా జగిత్యాల డివిజన్ -5 ఈఈ టీ శ్రీనివాసరావు గుప్తాకు, సంగారెడ్డి ఎస్ఈగా మెదక్ ఎస్ఈ యేసయ్యకు, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఎస్ఈగా వాలంతరీ ఈఈ రవీందర్‌రెడ్డికి, భద్రాచలం డిప్యూటీ ఎస్ఈగా భద్రాచలం డివిజన్- 5 ఈఈ హెచ్వీ రామ్‌ప్రసాద్‌ను నియమించింది. సాగునీటిశాఖ పారుదలశాఖ ఓఅండ్ఎం ఈఎన్సీ నాగేందర్రావును 6 నెలల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించింది.