హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారయ్యింది. ఈ నెల 22న మధ్యా హ్నం 12గంటలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేస్తారు. నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయం ఫస్టియర్‌తోపాటు సెకండియర్ ఫలితాలు విడుదల చేస్తారు. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ వా ర్షిక పరీక్షలు నిర్వహించారు.
ఫస్టియర్‌లో 4.88లక్షలు, సెకండియర్‌లో 5.08లక్షల చొప్పున మొత్తం 9.96లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.