బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 11:23:04

హెలిపోర్ట్స్‌, సీ ప్లేన్‌లపై రాష్ట్రం ఆసక్తి : మంత్రి కేటీఆర్‌

హెలిపోర్ట్స్‌, సీ ప్లేన్‌లపై రాష్ట్రం ఆసక్తి : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : బేగంపేట ఎయిర్‌పోర్టులో 3వ రోజు వింగ్స్‌ ఇండియా-2020 ప్రదర్శన నిర్వహించారు. ఎఫ్‌ఐసీసీఐ, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రీజినల్‌ కనెక్టివిటీ కోసమే పాత విమానాశ్రయాల పునరుద్దరణ అని పేర్కొన్నారు. విమానాశ్రయాలతో పాటు హెలిపోర్ట్స్‌, సీ ప్లేన్‌లపై రాష్ట్రం ఆసక్తిగా ఉందన్నారు. ఏవియేషన్‌ రంగం 14 శాతం వృద్ధితో ఎదుగుతోందని మంత్రి చెప్పారు. ఏరోస్పేస్‌, ఏవియేషన్‌ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని కేటీఆర్‌ తెలిపారు. వచ్చే 20 ఏళ్లలో భారత్‌కు 2,400 ఎయిర్‌క్రాఫ్ట్‌లు అవసరమన్నారు. నిర్వహణ, మరమ్మతుల కేంద్రం, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ఏవియేషన్‌ రంగంపై జీఎస్టీ తగ్గించేందుకు విధానపర నిర్ణయం తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. 


logo