Harish Rao | రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హనుమాన్ జయంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ ఆ హనుమంతుడి అనుగ్రహం లభించాలని హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు హరీశ్‌రావు ఓ శ్లోకాన్ని కూడా ట్వీట్ చేశారు.
‘యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్
బాష్పవారి పరిపూర్ణ లోచనమ్
మారుతిం నమత రాక్షసాంతకమ్..’
‘శ్రీరాముడి కీర్తనం ఎక్కడ వీనులవిందుగా వినిపిస్తుందో.. అక్కడ తలవంచి, జోడించిన చేతులు తలమీద ఉంచి, ఆనందబాష్పాలు చిందిస్తూ ఉండే, రాక్షసాంతకుడైన మారుతికి నమస్కరిస్తున్నాను’ అని దీని భావం.
‘యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్
బాష్పవారి పరిపూర్ణ లోచనమ్
మారుతిం నమత రాక్షసాంతకమ్..’శ్రీ హనుమాన్ విజయోత్సవ పర్వదిన శుభాకాంక్షలు. pic.twitter.com/Yc4qwgVVP1
— Harish Rao Thanneeru (@BRSHarish) April 23, 2024