Home
Telangana
Telangana Inter Second Year Students Will Get Marks Based On Inter First Year Results
ఫస్టియర్ మార్కులే.. సెకండియర్‌లో

- ఇంటర్ ప్రాక్టికల్స్‌లో 100% మార్కులు
- విధివిధానాలు ఖరారుచేసిన ప్రభుత్వం
- బ్యాక్లాగ్ సబ్జెక్టుల్లో 35% మార్కులు
- ఈ విధానం ఒక ఏడాదికే పరిమితం
- ఒకట్రెండు రోజుల్లో ఫలితాలు విడుదల
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మార్కులు ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఫస్టియర్‌లో పొందిన మార్కులనే సెకండియర్‌లోనూ కేటాయించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా బుధవారం విధివిధానాలను ఖరారుచేశారు. వీటి ప్రకారం ఫలితాలు ప్రకటించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శిని ఆదేశిస్తూ ఆయన ఉత్తర్వులు జారీచేశారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దుచేసిన విషయం తెలిసిందే. ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా ఫలితాలు ప్రకటించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా శుక్రవారం లేదా శనివారం ఫలితాలను విడుదలచేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు.
ఇవీ విధివిధానాలు
- 2020లో ఫస్టియర్‌లో (జనరల్, వొకేషనల్, బ్రిడ్జి) విద్యార్థులు పొందిన మార్కులనే సెకండియర్‌లో కేటాయిస్తారు. ఉదాహరణకు.. ఫస్టియర్ జీవశాస్త్రంలో 48 మార్కులు పొందితే.. సెకండియర్ జీవశాస్త్రంలోనూ 48 మార్కులనే కేటాయిస్తారు.
- ఫస్టియర్‌లో ఫెయిల్అయి పరీక్షఫీజు చెల్లించిన సెకండియర్ విద్యార్థులను 35% మార్కులతో పాస్‌చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 15న ఉత్తర్వులిచ్చారు. తాజాఉత్తర్వుల నేపథ్యంలో సెకండియర్‌లోనూ వీరిని 35% మార్కులతో పాస్ చేస్తారు.
- రెండో సంవత్సరం ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ జరగనందున ఆయా విద్యార్థులకు 100% మార్కులు ఇవ్వనున్నారు.
- ప్రైవేట్ విద్యార్థులతోపాటు గతంలో ఫెయిలైనవారికి సబ్జెక్ట్‌లవారీగా 35 శాతం మార్కులు ఇస్తారు. ఫస్టియర్‌లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ల్లో ఫెయిలైనవారికి 35% మార్కులిస్తారు. వీటిపై సంతృప్తిచెందకుంటే పరిస్థితులు కుదుటపడ్డాక పరీక్షలను నిర్వహిస్తాం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

