హైదరాబాద్ : ఆరోగ్య పురోగతిలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. ప్లిలలకు వ్యాక్సినేషన్, దవాఖానాల్లో ప్రసవాల పురోగతిలో అగ్రస్థానంలో ఉందని సోమవారం విడుదల చేసిన ‘హెల్త్ ఇండెక్స్’లో పేర్కొంది. దీనిపై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ట్వీట్ చేశారు.
‘మరో ఆమోదం లభించింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ‘ఇన్ ది పింక్ ఆఫ్ హెల్త్’ (మంచి ఆరోగ్యం, శ్రేయస్సు)తో ఉందని ఈసారి నీతి ఆయోగ్ చెప్పింది’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ఆరోగ్యం విషయంలో అద్భుతంగా ఉంది.. నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి’ అనే శీర్షికతో ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌కు జత చేశారు.
Yet another endorsement, this time from @NITIAayog saying Telangana under the leadership of #KCR Garu is in the Pink of Health 👍#Telangana excelled on health front, says Niti Aayog report | Hyderabad News – Times of India https://t.co/IOb7XgDtYs
— KTR (@KTRTRS) December 28, 2021