పెండింగ్ డీఏలపై హైకోర్టులో పిటిషన్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఐదు కరువు భత్యం (డీఏ) వాయిదాలను బకాయిలతో వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆదిలాబాద్‌కు చెందిన ప్రభుత్వోద్యోగి మహ్మద్ నిజాముద్దీన్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది రాజ్‌కుమార్ గుమ్మి రిట్‌పిటిషన్ దాఖలుచేశారు.
- ప్రభుత్వానికి నోటీసులు జారీ
- ఈ నెల 29కి విచారణ వాయిదా
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఐదు కరువు భత్యం (డీఏ) వాయిదాలను బకాయిలతో వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆదిలాబాద్‌కు చెందిన ప్రభుత్వోద్యోగి మహ్మద్ నిజాముద్దీన్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది రాజ్‌కుమార్ గుమ్మి రిట్‌పిటిషన్ దాఖలుచేశారు. 2024 జనవరి 1, 2024 జూలై 1, 2025 జనవరి 1, 2025 జూలై 1, 2026 జనవరి 1 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. జీవో ఎంఎస్ నం.52 (ఆర్థిక శాఖ, తేది: 11.06.2021) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెంచే ప్రతి ఒక శాతం డీఏకుగానూ తెలంగాణ ఉద్యోగులకు 0.91 శాతం డీఏ లెకించి వర్తింపజేయాల్సి ఉంటుందని పిటిషన్లో పేరొన్నారు.
కేంద్ర ప్రభుత్వం సంబంధిత కాలవ్యవధిలో ఐదు విడతల్లో డీఏను సవరించి విడుదల చేసినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ ఐదు వాయిదాల డీఏలను ఇప్పటివరకు విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచిందని తెలిపారు. ప్రస్తుత లెకల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన మొత్తం డీఏ 46.41 శాతానికి చేరగా, ప్రభుత్వం చివరిగా కేవలం 33.67 శాతం డీఏను మాత్రమే మంజూరు చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో మిగిలిన 12.74 శాతం డీఏ వాయిదాలను తక్షణమే ఉద్యోగులకు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, 2026 సెప్టెంబర్ 1న ‘నోటీస్ బిఫోర్ అడ్మిషన్’ ఉత్తర్వులను జారీచేసింది. ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు నోటీసులను స్వీకరించి, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి గడువు కోరారు. ఇందుకు అనుమతించిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

