లెక్చరర్ల తొలగింపు ఉత్తర్వుల నిలిపివేత
నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారన్న ఆరోపణలపై 35 మంది జూనియర్ లెక్చరర్లను తొలగిస్తూ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జారీచేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు బుధవారం నిలిపివేసింది. తొలగించిన 35 మందిని తక్షణం తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. అయితే చట్టప్రకారం నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారన్న ఆరోపణలపై శాఖాపరమైన విచారణ జరుపడానికి ఈ ఉత్తర్వులు అడ్డంకి కావని స్పష్టంచేసింది.
- 35 మంది తక్షణం విధుల్లో తీసుకోవాలి
- మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన హైకోర్టు
- విచారణ కొనసాగింపునకు అనుమతి
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారన్న ఆరోపణలపై 35 మంది జూనియర్ లెక్చరర్లను తొలగిస్తూ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జారీచేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు బుధవారం నిలిపివేసింది. తొలగించిన 35 మందిని తక్షణం తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. అయితే చట్టప్రకారం నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారన్న ఆరోపణలపై శాఖాపరమైన విచారణ జరుపడానికి ఈ ఉత్తర్వులు అడ్డంకి కావని స్పష్టంచేసింది.
నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారన్న ఆరోపణలతో 35 మందిని తొలగిస్తూ ఈ నెల ఒకటిన ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ 35 మంది పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కే శరత్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కాంట్రాక్ట్ లెక్చరర్లుగా విధులు నిర్వహిస్తున్న మూడు వేల మందిని 2023లో క్రమబద్ధీకరించారని, వారిలో పిటిషనర్లను మాత్రం తొలగించారని చెప్పారు. వీరికి ఆయా యూనివర్సిటీలు అందజేసిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాకే క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. వాటిలో ఏవైనా సందేహాలుంటే విచారణ జరుపవచ్చని, అలాంటిదేమీ లేకుండా తొలగించడం చెల్లదని అన్నారు.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ నకిలీ పత్రాలతో జరిగిన నియామకం చెల్లదని, అందువల్ల శాఖాపరమైన విచారణ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని అన్నారు. యూనివర్సిటీల నుంచి ధ్రువీకరణ తెప్పించుకున్నాకే తొలగింపు ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి రీజినల్ జాయింట్ డైరెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేసి, తొలగింపు ఉత్తర్వులను డైరెక్టర్ జారీ చేయడం సూర్జిత్ ఘోష్ వర్సెస్ యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చెల్లదని అన్నారు. కాంట్రాక్ట్, జూనియర్ లెక్చరర్లుగా పదేండ్లకు పైగా పనిచేసిన వారి నియామక ఉత్తర్వులను ఎటువంటి విచారణ చేపట్టకుండా రద్దు చేసే అధికారం అధికారులకు లేదని పేరొన్నారు. ఎలాంటి విచారణ లేకుండా జారీచేసిన తొలగింపు ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామని అన్నారు. తొలగించిన 35 మందినీ తక్షణం విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

