హైదరాబాద్, 10 (నమస్తే తెలంగాణ): ఎస్బీఐలో రూ.13.71 కోట్ల విలువైన నగ దు, బంగారు ఆభరణాల చోరీకి సంబంధించిన కేసుల దర్యాప్తులో పోలీసులకు సహకరించాల్సిందేనని ముత్తూట్, మణప్పురం ఫైనాన్స్ సంస్థలను హైకోర్టు ఆదేశించింది.
ఆ నగలను తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్న నిందితుల వివరాలను అందజేయాలని మంచిర్యాల పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ ఆ రెండు సంస్థలు హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కు మార్ బుధవారం ఈ ఆదేశాలు జారీచేశారు.