హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తేతెలంగాణ): ఉస్మానియా వర్సిటీ పరిధిలోని తాతాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలంటూ 2000 సంవత్సరంలో హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో 31 మంది కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సుద్దాల చలపతిరావు బుధవారం విచారణ చేపట్టారు.
తాతాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణకు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఈ నెల 27లోగా అమలు చేయాలని, లేకుంటే వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది.