హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఐదు నెలల క్రితమే తెలంగాణ హైకోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
వీరిలో జస్టిస్ నాగార్జున గత నెల మద్రాస్ హైకోర్టుకు బదిలీ కాగా ఇప్పుడు జస్టిస్ అభిషేక్‌రెడ్డి బదిలీ అయ్యా రు. ఏపీ నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ లలితను కర్ణాటక హైకోర్టుకు పంపించాలన్న ప్రతిపాదన పెండింగ్‌లో ఉన్నది. తాజా బదిలీతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి తగ్గింది.