హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. ఒక మైనర్ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై నమోదైన కేసులో కొన్ని రోజులుగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఆర్డర్ కాపీలు శుక్రవారం ఉదయం చర్లపల్లి జైలు అధికారులకు అందడంతో..
చట్టపరమైన ప్రక్రియలన్నీ ముగిసిన అనంతరం మధ్యాహ్నం బండి భగీరథ్‌ను విడుదల చేశారు. కోర్టు విధించిన షరతుల ప్రకారం దర్యాప్తునకు పూర్తిగా సహకరించాల్సి ఉంటుందని, సాక్షులను ప్రభావితం చేయకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది.