 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాథమిక హకు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనే అంశం ప్రాథమిక హకు పరిధిలోకి రాదని తెలిపింది. సుప్రీంకోర్టు జావెద్ వర్సెస్ హర్యానా కేసులో వెలువరించిన తీర్పు ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయడమనే అంశం ప్రాథమిక హకు కాదని వివరించింది.
ఇదేమీ వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక హకు ఉల్లంఘన కాదని సుప్రీంకోర్టు తీర్పులో పేరొందని గుర్తుచేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థికి ఇద్దరు కంటే ఎకువ మంది పిల్లలు ఉండకూడదన్న తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21(3)ను కొట్టివేయాలంటూ సంగారెడ్డి జిల్లా కంది మండలానికి చెందిన ఉప్పు వీరన్న ఇతరులు పిటిషన్ వేశారు.
దీనిని చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. పీఆర్ యాక్ట్‌లోని సెక్షన్ 21(3) నిబంధన రాజ్యాంగం కల్పించిన 14, 19(1)(జీ), 21 అధికరణాలకు వ్యతిరేకమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ నిబంధనను సవరిస్తూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఇంకా ఆమోదం తెలుపలేదని అన్నారు. వాదనలపై స్పందించిన హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం అన్నది ప్రాథమిక హకు కాబోదని స్పష్టం చేసింది. గవర్నర్ ఆమోదం చెప్పని అంశంలో జోక్యం చేసుకోబోమని వెల్లడించింది.
 
                            