హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): మాసబ్‌ట్యాంక్ పోలీసుల జులుంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులో మంగళవారం అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఓ కేసు విచారణలో భాగంగా ఇటీవల దాదాపు 50 మంది పోలీసులు దౌర్జన్యంగా తన ఇంట్లోకి చొరబడి బలవంతంగా ఐఫోన్‌ను లాక్కెళ్లారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
ఆ ఫోన్‌ను తిరిగి ఇప్పించేలా పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించిన జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.