హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్లు దాఖలయ్యాయి. కుమారుడు హిమాన్షు పేరిట ఆస్తులు ఎలా వచ్చాయన్న విషయాన్ని కేటీఆర్ తన ఎన్నికల అఫిడవిట్లో వివరించలేదంటూ సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డి, లగిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు శుక్రవారం విచారణ చేపట్టారు. కౌంటర్ల దాఖలు నిమిత్తం కేటీఆర్, సీఈసీ, తెలంగాణ సీఈవో, సిరిసిల్ల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన ఆర్డీవోకు నోటీసులు జారీచేసి.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు.