హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : గౌహతిలో నమోదైన కేసులో కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో తాతాలిక ఉపశమనం లభించింది. గౌహతి పరిధిలోని సంబంధిత కోర్టును ఆశ్రయించేందుకు వీలుగా వారం రోజులపాటు ముందస్తు బెయిల్ మంజూరైంది. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్య రిణికి భూయాన్శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గౌహతి పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పవన్ ఖేరా దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ కేసు జన శుక్రవారం విచారించారు.
ఈ కేసులో హైకోర్టు, పలు షరతులతో తాతాలిక ఉపశమనం కల్పిస్తూ ఉత్తర్వులను జారీచేసింది. లక్ష వ్యక్తిగత బాండ్తోపాటు మరో ఇద్దరి పూచీకత్తును గౌహతి దర్యాప్తు అధికారికి సమర్పించాలని తెలిపింది. వారంలోగా కేసు నమోదైన ప్రాంతం పరిధిలోని కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందాలని తెలిపింది.