హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంక టేశ్వరరావుకు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే వరకు నెల రోజులపాటు దానిని నిలిపివేయాలంటూ వనమా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తీర్పు కాపీ తీర్పు చెప్పిన రోజునే అందుబాటులోకి వచ్చిందని, తీర్పును నిలుపుదల చేసేందుకు కారణాలు ఏమీలేవని స్పష్టం చేసింది.
ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో తప్పుగా పేరొ న్నారని తేల్చిన హైకోర్టు.. వనమా ఎన్నిక చెల్లదని గత మంగళవారం తీర్పు చెప్పింది. దీనిని నిలిపివేయాలంటూ వనమా అత్యవసరంగా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను జస్టిస్ జీ రాధారాణి కొట్టేస్తూ గురువారం తుది ఉత్తర్వులు జారీ చేశారు. మూడు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ తీర్పు వల్ల తనకు నష్టం వాటిల్లుతుందన్న ఒక కారణం తప్ప తీర్పు అమలు నిలిపివేతకు సహేతుక కారణాలు ఏమీ పిటిషనర్ పేరొనలేదని హైకోర్టు స్పష్టంచేసింది. అక్రమాల కొనసాగింపునకు అనుమతించలేమని పేర్కొన్నది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోని పక్షంలో తమ తీర్పు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. తీర్పు ప్రతి ఎన్నికల కమిషన్ ద్వారా శాసనసభ స్పీకర్‌కు అందితే కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు ఎన్నికైనట్టుగా ప్రకటించేందుకు మార్గం ఏర్పడుతుంది.