హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం.. బీఆర్ఎస్ విజయమని ఆ పార్టీ నేత, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకొని ఈ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నానమని తెలిపారు.
కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. లేనిపక్షంలో ప్రభుత్వ తప్పులను బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ, రిజర్వేషన్లు అమలయ్యే వరకు బీసీల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.